అభిషేక్ శర్మతో అభిమాని దురుసు ప్రవర్తన.. చేయి పట్టి లాగిన యువతి.. ఇదిగో వీడియో!
- హోటల్లో అభిషేక్ శర్మ చేయి పట్టి లాగిన లేడీ ఫ్యాన్
- అభిమాని అత్యుత్సాహంతో తీవ్ర అసహనానికి గురైన అభిషేక్
- ఇది భద్రతా వైఫల్యమేనంటూ సోషల్ మీడియాలో చర్చ
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మకు మైదానం బయట ఓ చేదు అనుభవం ఎదురైంది. శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత టీమ్ హోటల్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. తన అభిమాన క్రికెటర్‌ను చూసిన ఓ మహిళా అభిమాని అత్యుత్సాహంతో అభిషేక్ శర్మ చేతిని పట్టుకుని బలవంతంగా లాగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భద్రతా సిబ్బంది చుట్టూ ఉన్నప్పటికీ, అభిమాని ప్రవర్తనతో అభిషేక్ తీవ్ర అసహనానికి, ఆగ్రహానికి గురైనట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కచ్చితంగా భద్రతా వైఫల్యమేనని, ఆటగాళ్ల ప్రైవసీకి భంగం కలిగించడమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
మైదానం బయట ఈ సంఘటనతో అభిషేక్ అసౌకర్యానికి గురైనప్పటికీ, మైదానంలో మాత్రం తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన హై-స్కోరింగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజయంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. కేవలం 29 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 57 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేశాడు. 196కు పైగా స్ట్రైక్ రేట్‌తో ఆడిన అభిషేక్‌కు, ఈ ఐపీఎల్ 2026 సీజన్లో ఇది మూడో అర్ధ సెంచరీ కావడం విశేషం.
కేన్ విలియమ్సన్‌ను దాటేసిన అభిషేక్
ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో అభిషేక్ శర్మ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తరఫున అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా న్యూజిలాండ్ దిగ్గజం కేన్ విలియమ్సన్‌ను అధిగమించాడు. అభిషేక్ ఇప్పటివరకు 82 మ్యాచ్‌లలో 79 ఇన్నింగ్స్‌లు ఆడి 29.21 సగటు, 169.28 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 2,133 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. అంతకుముందు ఈ స్థానంలో ఉన్న విలియమ్సన్ 76 మ్యాచ్‌లలో 2,101 పరుగులు చేశాడు.