క్రికెట్‌లో ఉన్నట్లు రోడ్డుపై 'డీఆర్ఎస్' సిస్టం ఉండదు: సజ్జనార్ ట్వీట్

Sajjanar says there is no DRS in life
  • మీ వికెట్ మీరు పారేసుకుంటే శాశ్వతంగా పైకి పోతారన్న సజ్జనార్
  • యమధర్మరాజు వద్ద డెత్ రివ్యూ సిస్టం ఉండదని వ్యాఖ్య
  • క్రికెట్ అభిమానం ఉండొచ్చు.. వెర్రి పిచ్చి మాత్రం ఉండవద్దని సూచన
రోడ్డు మీద నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ మీ వికెట్ పారేసుకుంటే మీరు పర్మినెంట్‌గా పైకి వెళతారని, క్రికెట్‌లో ఉన్నట్లు డీఆర్ఎస్ సిస్టం ఉండదని హైదరాబాద్ సీపీ సజ్జనార్ చమత్కరించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు. "మీరు చూసే ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో డీఆర్ఎస్ (డెసిషన్ రివ్యూ సిస్టమ్) ఉంటుంది కానీ యమధర్మరాజు వద్ద మాత్రం డీఆర్ఎస్ (డెత్ రివ్యూ సిస్టం) ఉండదు" అని పేర్కొన్నారు. 

క్రికెట్ మైదానంలో  వికెట్ పడితే ప్లేయర్ పెవిలియన్‌కి వెళ్తాడని, కానీ రోడ్డు మీద నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ మీ వికెట్ పారేసుకుంటే మాత్రం శాశ్వతంగా పైకి వెళతారని హెచ్చరించారు. క్రికెట్‌లో అంపైర్ నిర్ణయంపై రివ్యూ అడిగే అవకాశం ఉంటుందని, కానీ రోడ్డు మీద ఇష్టారీతిన డ్రైవింగ్ చేస్తే డీఆర్ఎస్ అవకాశం ఉండదని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్‌లో స్కోర్ బోర్డు చూస్తూ మీ జీవితాన్ని 'జీరో'కి క్లీన్ బౌల్డ్ చేసుకోవద్దని సూచించారు.

మీకు మ్యాచ్ ముఖ్యం కావొచ్చు కానీ మీ కోసం ఇంట్లో ఎదురుచూసే మీ కుటుంబానికి మీరు మాత్రమే ముఖ్యమని గుర్తుంచుకోవాలని అన్నారు. క్రికెట్‌పై అభిమానం ఉండటంలో తప్పులేదని, కానీ ప్రాణాలు తీసే వెర్రి పిచ్చి మాత్రం ఉండవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఒక వీడియోను షేర్ చేశారు.
Go Back to Shorts
Decision Review System(DRS)
IPL
IPS Sajjanar

More Telugu News