హీరోగా సత్య.. నవ్వులే నవ్వులు పంచేలా ‘జెట్లీ’ ట్రైలర్!

  • కమెడియన్ సత్య హీరోగా నటిస్తున్న చిత్రం 'జెట్లీ'
  • పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపకల్పన
  • మే 1న థియేటర్లలోకి రానున్న సినిమా
  • హీరోయిన్‌గా మిస్ యూనివర్స్ ఇండియా 2024 రియా సింఘా
  • తాజాగా విడుదలైన సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన
స్టార్ కమెడియన్‌గా టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన సత్య, ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘జెట్లీ’. రితేశ్‌ రానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ ట్రైలర్, చూసిన వారిని కడుపుబ్బా నవ్విస్తోంది.

ట్రైలర్ ఆద్యంతం సత్య తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచగా, ఇప్పుడు ట్రైలర్‌తో అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాలో 2024 మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్ విజేత రియా సింఘా హీరోయిన్‌గా నటించడం ఒక ప్రత్యేక ఆకర్షణ. ప్రముఖ నటులు వెన్నెల కిశోర్, వైవా హర్ష, అజయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు కాల భైరవ సంగీతాన్ని అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'జెట్లీ' చిత్రం మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.


Jetlee
Satya
Telugu movie trailer
Ritesh Rana
Riya Singha
Vennela Kishore
Viva Harsha
Maitree Movie Makers
Comedy entertainer

More Telugu News