బీజేపీలోకి వెళ్తారని ప్రచారం.. స్పందించిన జీవన్ రెడ్డి
- ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే బీజేపీలో చేరతారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం
- ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్న జీవన్ రెడ్డి
- నా రాజకీయ ఎదుగుదలను ఓర్చుకోలేక బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయని ఆగ్రహం
రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు కేసీఆర్ వెంటే ఉంటానని అన్నారు. ఆయన నాయకత్వంలో పని చేయడం తనకు గర్వకారణమని అన్నారు. తాను బీజేపీలో చేరే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కార్యకర్తలు, అభిమానులు ఇలాంటి అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. తాను ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే సైనికుడిగా కొనసాగుతానని స్పష్టం చేశారు.