ఇరాన్ నాయకత్వం నేరుగా నన్నే కలవాలనుకుంటే అభ్యంతరం లేదు: ట్రంప్
- తమ వద్ద చాలామంది సమర్థవంతమైన వ్యక్తులు ఉన్నారన్న ట్రంప్
- అమెరికా, ఇరాన్ రెండో విడత చర్చలపై ఉత్కంఠ
- వాషింగ్టన్ మితిమీరిన డిమాండ్లు పెడుతోందన్న ఇరాన్
ఇరాన్ నాయకత్వం నేరుగా తననే కలవాలనుకుంటే తనకు అభ్యంతరం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య జరగాల్సిన రెండో విడత చర్చలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ మాట్లాడుతూ, ఇరాన్ నాయకత్వంతో నేరుగా సంప్రదింపులు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. వారు కలవాలనుకుంటే తమ వద్ద చాలామంది సమర్థవంతమైన వ్యక్తులు కూడా ఉన్నారని ట్రంప్ తెలిపారు.
చర్చలు జరపలేం: ఇరాన్
ప్రస్తుత పరిస్థితుల్లో చర్చలు జరపలేమని ఇరాన్ పార్లమెంటరీ జాతీయ భద్రతా కమిషన్ సభ్యుడు మొహమ్మద్ రెజా వెల్లడించారు. వాషింగ్టన్ మితిమీరిన డిమాండ్లు తమ ముందు ఉంచుతోందని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వచ్చే దఫా చర్చలు కూడా సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా, అమెరికా సైన్యం నుంచి పదేపదే హెచ్చరికలు వచ్చినప్పటికీ, ఒక ఇరాన్ చమురు ట్యాంకర్ తమ దేశ జలాల్లోకి విజయవంతంగా ప్రవేశించిందని ఇరాన్ సైన్యం ప్రకటించింది. అమెరికా నావికాదళం హెచ్చరికలను పక్కనపెట్టి, సిలిసిటీ అనే ట్యాంకర్ అరేబియా సముద్రం గుండా ప్రయాణించి ఇరాన్ జలాల్లోకి చేరుకుందని తెలిపింది.