నటుడు పార్తిబన్‌కు ‘నో కాస్ట్ - నో రిలీజియన్’ సర్టిఫికెట్‌

High Court orders officials to issue no caste certificate to Parthiban
  • ఇటీవల ఓ ఈవెంట్‌లో పొరపాటున తన కులం పేరును ప్రస్తావించిన పార్తిబన్
  • విమర్శలు రావడంతో తీవ్రంగా కలత చెందిన వైనం
  • కులం, మతం లేని సర్టిఫికెట్ కోసం హైకోర్టుకు వెళ్లిన పార్తిబన్

తమిళ సినీ నటుడు పార్తిబన్‌ తనకు ఏ కులం, మతం లేదని అధికారికంగా ప్రకటించే ‘నో కాస్ట్ - నో రిలీజియన్’ సర్టిఫికెట్‌ను పొందాలని నిర్ణయించుకున్నారు. దీనిపై ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన మద్రాస్ హైకోర్టు, ఏప్రిల్ 29లోపు ఆయనకు ఆ సర్టిఫికెట్‌ను జారీ చేయాలని అధికారులను ఆదేశిస్తూ తీర్పునిచ్చింది.


ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఈవెంట్‌లో పార్తిబన్ మాట్లాడుతూ పొరపాటున తన కులం పేరును ప్రస్తావించారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆయన తీవ్రంగా కలత చెందారు. కేవలం ఒక మాట పొరపాటు వల్ల ఇంత గందరగోళం జరగడం చూసి, ఇకపై తనకు ఎలాంటి కులమత గుర్తింపు ఉండకూడదని భావించి ఈ చట్టపరమైన అడుగు వేశారు.


"కులం ప్రాతిపదికన వచ్చే ఎలాంటి ప్రభుత్వ ప్రయోజనాలు నాకు అవసరం లేదు. నా కష్టాన్నే నేను నమ్ముతాను. ఒక కొత్త సమాజ నిర్మాణానికి నా వంతు ప్రయత్నమిది" అని పార్తిబన్ అన్నారు. "ఒక సామాన్యుడు తనకు కులం, మతం లేదని సర్టిఫికెట్ కోరుకుంటే కోర్టు దాకా వెళ్లాలా? ఈ ప్రక్రియను ప్రభుత్వం మరింత సులభతరం చేయాలి" అని కోరారు.

Go Back to Shorts
Parthiban
Tollywood
Kollywood
No caste certificate

More Telugu News