ఇరాన్‌కు చైనా సాయం.. అమెరికా పట్టుకున్న నౌకతో గుట్టురట్టు?
- హర్మూజ్ జలసంధిలో ఇరాన్‌కు చెందిన నౌకను అడ్డగించిన అమెరికా
- షిప్లో క్షిపణుల కోసం రసాయనాలు ఉన్నాయని నిక్కీ హేలీ ఆరోపణ
- చైనా నుంచి వస్తున్న ఈ నౌక ఇరాన్‌కు చైనా సాయానికి నిదర్శనమన్న హేలీ
- అమెరికా చర్యను ‘సాయుధ దోపిడీ’గా అభివర్ణించిన ఇరాన్
అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. హర్మూజ్ జలసంధిలో అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఉల్లంఘించి ప్రయాణిస్తున్న ఇరాన్ నౌకను అమెరికా నౌకాదళం స్వాధీనం చేసుకుంది. అయితే, చైనా నుంచి వస్తున్న ఈ నౌకలో క్షిపణుల కోసం ఉద్దేశించిన రసాయన సామగ్రి ఉందని రిపబ్లికన్ పార్టీ నేత, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ సంచలన ఆరోపణలు చేశారు.
"ఈ వారాంతంలో హర్మూజ్ జలసంధిలో అమెరికా పట్టుకున్న నౌక, చైనా నుంచి ఇరాన్‌కు వెళ్తోంది. ఇందులో క్షిపణుల కోసం రసాయన సామగ్రి ఉంది. ఆగమని పదేపదే హెచ్చరించినా అది ఆగలేదు" అని నిక్కీ హేలీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇరాన్ పాలనకు చైనా మద్దతిస్తోందన్న వాస్తవాన్ని ఇకపై విస్మరించలేమని ఆమె వ్యాఖ్యానించారు.
అమెరికా దళాలు 'టౌస్కా' అనే ఇరాన్ జెండా ఉన్న కంటైనర్ షిప్‌ను గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ఇరాన్‌కు చెందిన చాబహార్ పోర్ట్ సమీపంలో అదుపులోకి తీసుకున్నాయి. ఈ నౌక ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ షిప్పింగ్ లైన్స్ (ఐఆర్ఐఎస్ఎల్) సమూహానికి చెందింది. అమెరికా చర్యను 'సాయుధ దోపిడీ'గా ఇరాన్ అభివర్ణించింది. దిగ్బంధనాన్ని ఎత్తివేసే వరకు చర్చలకు హాజరుకాబోమని స్పష్టం చేసింది.
మరోవైపు రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకారం ఈ నౌకలో సైనిక, పౌర అవసరాలకు వాడే ద్వంద్వ వినియోగ వస్తువులు ఉండవచ్చని అమెరికా భద్రతా వర్గాలు ప్రాథమికంగా అంచనా వేస్తున్నాయి. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి సహాయం చేస్తోందన్న ఆరోపణలతో అమెరికా ఇప్పటికే 2019లో ఐఆర్ఐఎస్ఎల్ సంస్థపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.