ప్రయాణికురాలికి రైడర్ అనుచిత సందేశాలు.. క్షమాపణలు చెప్పిన ర్యాపిడో
- ఘజియాబాద్‌లో మహిళా ప్రయాణికురాలికి చేదు అనుభవం
- స్క్రీన్ షాట్లను ఆధారాలుగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ప్రయాణికురాలు
- ఫోన్ నెంబర్, రైడ్ ఐడీ ద్వారా రైడర్‌ను గుర్తించి చర్యలు తీసుకుంటామన్న ర్యాపిడో
ఘజియాబాద్‌లో ఒక మహిళ ర్యాపిడోను బుక్ చేసుకుంది. గమ్యం చేరిన తర్వాత సదరు ర్యాపిడో డ్రైవర్ కస్టమర్ ఇచ్చిన ఫోన్ నెంబర్‌తో వాట్సాప్‌లో కాంటాక్ట్ అయ్యాడు. అజ్ఞాత వ్యక్తిగా చాట్ చేయడం ప్రారంభించాడు.
"మీరు చూడటానికి అందంగా ఉన్నారు. మీ వయస్సెంత" అంటూ చాట్ చేయడం ప్రారంభించాడు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ఆమె సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. దీనితో ర్యాపిడో సంస్థ స్పందించింది. ఆ డ్రైవర్ అనుచిత ప్రవర్తనపై క్షమాపణలు కోరింది. రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్, రైడ్ ఐడీ ద్వారా అతడిని గుర్తించి, చర్యలు తీసుకుంటామని తెలిపింది.