విజయవాడ పటమట క్యాంటీన్‌కు సీఎం దంపతులు

Chandrababu Naidu visits Patamata Canteen with wife on birthday
  • సీఎం చంద్రబాబు తన జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్‌కు
  • విజయవాడ పటమట క్యాంటీన్‌లో అల్పాహారం చేయనున్న సీఎం దంపతులు
  • అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షలు విరాళం ప్రకటించిన నారా భువనేశ్వరి
  • నేడు రాష్ట్రంలోని 269 క్యాంటీన్లలో ఉచితంగా ఆహారం
సీఎం చంద్రబాబు నాయుడు తన జన్మదినం సందర్భంగా ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు ఉదయం 9:30 గంటలకు విజయవాడలోని పటమట అన్న క్యాంటీన్‌కు తన అర్ధాంగి నారా భువనేశ్వరితో కలిసి వెళ్లి అల్పాహారం చేయనున్నారు. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్‌లోనే తన పుట్టినరోజు వేడుకను జరుపుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు.

ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని నారా భువనేశ్వరి భారీ విరాళం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్ల ఒక రోజు నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఆమె రూ.76 లక్షలను విరాళంగా అందించారు. ఈ విరాళంతో నేడు రాష్ట్రంలోని అన్ని అన్న క్యాంటీన్లలో ప్రజలకు ఉచితంగా ఆహారాన్ని అందించనున్నారు.

ముఖ్యమంత్రి జన్మదినం రోజున రాష్ట్రవ్యాప్తంగా పేదలు, సామాన్యులు ఉచితంగా భోజనం చేసేలా ఏర్పాట్లు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సీఎం దంపతుల రాక సందర్భంగా పటమట అన్న క్యాంటీన్ వద్ద అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
Go Back to Shorts
Chandrababu
Nara Bhuvaneswari
Vijayawada
Patamata
Anna Canteen
Andhra Pradesh
AP CM
Birthday celebrations
Charity

More Telugu News