థాంక్యూ మోదీజీ.. మీ మాటలు, ప్రోత్సాహం నాకు బలానిచ్చాయి: పవన్ కల్యాణ్
- శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ ఫోన్
- పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ప్రధాని
- ప్రధాని శ్రద్ధకు కృతజ్ఞతలు తెలియజేసిన జనసేనాని
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. అనారోగ్యం కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సంభాషణ అనంతరం ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
"పవన్ కల్యాణ్ గారితో మాట్లాడాను. ఆయన చాలా ధైర్యవంతుడు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని ప్రధాని మోదీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రధాని చూపిన ఆప్యాయతకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. మోదీ ఆశీస్సులు, ప్రోత్సాహం తనకు గొప్ప బలాన్ని ఇస్తాయని ఆయన బదులిచ్చారు.
ఈ మేరకు పవన్ స్పందిస్తూ.. "గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారికి ధన్యవాదాలు. సర్జరీ అనంతరం నా ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి సమయం కేటాయించి మాట్లాడినందుకు కృతజ్ఞతలు. నా ఆరోగ్యం పట్ల మీ ఆందోళన, నేను త్వరగా కోలుకోవాలని మీరు తెలిపిన శుభాకాంక్షలు నాకు గొప్ప బలాన్ని ఇస్తున్నాయి. మీ మార్గదర్శకత్వం, మద్దతుకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను" అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.