ఇరాన్ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయలేదు: ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- హర్మూజ్‌ను మూసివేయడం ద్వారా ఇరాన్ తమపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోందన్న ట్రంప్
- టెహ్రాన్ దశాబ్దాలుగా ఇలాగే వ్యవహరిస్తోందన్న ట్రంప్
- ఇరుపక్షాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయన్న ట్రంప్
ఇరాన్ తమను బ్లాక్మెయిల్ చేయలేదని హెచ్చరించారు. "టెహ్రాన్ దశాబ్దాలుగా ఇలాగే వ్యవహరిస్తోంది. కానీ వారు మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయలేరు" అని వైట్ హౌస్ లో విలేకరుల సమావేశంలో ట్రంప్ అన్నారు. ఇరుపక్షాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఇరాన్‌తో సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈరోజు ముగిసే సమయానికి సంప్రదింపులకు సంబంధించి కొంత సమాచారం లభిస్తుందని వెల్లడించారు.
హర్మూజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ తొలుత ప్రకటించింది. ఇరవై నాలుగు గంటలు తిరగక ముందే తిరిగి మూసివేస్తున్నట్లు ప్రకటించింది. తమ ఓడరేవుల చుట్టూ అమెరికా తన దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్నందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ తెలిపింది.