ఇరాన్ మమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేయలేదు: ట్రంప్ కీలక వ్యాఖ్యలు

  • హర్మూజ్‌ను మూసివేయడం ద్వారా ఇరాన్ తమపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోందన్న ట్రంప్
  • టెహ్రాన్ దశాబ్దాలుగా ఇలాగే వ్యవహరిస్తోందన్న ట్రంప్
  • ఇరుపక్షాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయన్న ట్రంప్
ఒకవైపు హర్మూజ్ జలసంధి, ఇరాన్ నౌకాశ్రయాలను అమెరికా దిగ్బంధించడం, మరోవైపు జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించడం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చమురు ఆందోళనలకు కారణమైంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ జలసంధిని మూసివేయడం ద్వారా ఇరాన్ తమపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోందని, కానీ ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని అన్నారు.

ఇరాన్ తమను బ్లాక్‌మెయిల్ చేయలేదని హెచ్చరించారు. "టెహ్రాన్ దశాబ్దాలుగా ఇలాగే వ్యవహరిస్తోంది. కానీ వారు మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయలేరు" అని వైట్ హౌస్ లో విలేకరుల సమావేశంలో ట్రంప్ అన్నారు. ఇరుపక్షాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఇరాన్‌తో సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈరోజు ముగిసే సమయానికి సంప్రదింపులకు సంబంధించి కొంత సమాచారం లభిస్తుందని వెల్లడించారు.

హర్మూజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ తొలుత ప్రకటించింది. ఇరవై నాలుగు గంటలు తిరగక ముందే తిరిగి మూసివేస్తున్నట్లు ప్రకటించింది. తమ ఓడరేవుల చుట్టూ అమెరికా తన దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్నందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ తెలిపింది.

Donald Trump
Iran
Hormuz Strait
US Sanctions
Oil Prices
Tehran
White House
US Foreign Policy

More Telugu News