మీ స్థాయికి దిగజారలేను: ప్రకాశ్ రాజ్‌కు నాగబాబు కౌంటర్
- పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు గట్టిగా బదులిచ్చిన నాగబాబు
- తల్లి అంత్యక్రియల్లో ఆమె నమ్మకాన్ని గౌరవించారని గుర్తు చేసిన వైనం
- నాస్తికత్వం అంటే హేతుబద్ధమైన ఆలోచన కానీ, విశ్వాసాలను గేలిచేయడం కాదని స్పష్టీకరణ
- హిందూమతం నాస్తికత్వాన్ని కూడా గౌరవిస్తుందని నాగబాబు వ్యాఖ్య
- మీతో వాదనకు దిగడం అంటే స్థాయిని తగ్గించుకోవడమేనని ఘాటుగా స్పందించిన నాగబాబు
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌పై జనసేన ఎమ్మెల్సీ, మెగా బ్రదర్ నాగబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు నాగబాబు ఘాటుగా బదులిచ్చారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘమైన, సూటి వ్యాఖ్యలు చేశారు.
"మిమ్మల్ని మీరు క్రిస్టియన్ నాస్తికులు అని చెప్పుకుంటారు. మీ తల్లి అంత్యక్రియల సమయంలో ఆమె నమ్మకాన్ని గౌరవించారు. ఒక కొడుకుగా మీ బాధ్యతను మేం గౌరవిస్తున్నాం. అదే స్ఫూర్తితో కోట్లాది మంది నమ్మకాలను కూడా మీరు గౌరవించాలి" అని నాగబాబు హితవు పలికారు. నాస్తికత్వం అంటే దేవుళ్లను, విశ్వాసాలను గేలిచేయడం కాదని, అదొక హేతుబద్ధమైన ఆలోచనా విధానమని స్పష్టం చేశారు.
"నాస్తిక తత్వాన్ని సైతం స్వీకరించే ఏకైక మతం హిందూమతం. అలాంటి గొప్ప సంప్రదాయాన్ని తోసిపుచ్చడం హేతుబద్ధం కాదు, అది అగౌరవపరచడమే అవుతుంది. ఇవే మాటలు మీరు వేరే దేశాల్లో అని ఉంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చేది" అని నాగబాబు అన్నారు.
"ఇది మీపై నా సూటి వ్యాఖ్య. భవిష్యత్తులో మీలాంటి గౌరవం మరిచి ప్రవర్తించే వారితో నేను వాదనలకు దిగను" అని తేల్చి చెప్పారు. లోక్ సభలో మహిళా రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో, ప్రధాని మోదీ మెప్పు పొందేందుకు ప్రజలకు అబద్ధాలు చెప్పడం మానుకోవాలని పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే నాగబాబు ఈ మేరకు స్పందించారు.