మెలోనీ బుగ్గపై మాక్రాన్ ముద్దు... సోషల్ మీడియాలో వీడియో వైరల్!
- పారిస్‌లో భేటీ అయిన ఫ్రాన్స్, ఇటలీ అధినేతలు
- ఇరువురి ఆలింగనం వీడియో సోషల్ మీడియాలో వైరల్
- వారి బాడీ లాంగ్వేజ్‌పై నెటిజన్ల భిన్న స్పందనలు
- ఇరాన్, హార్ముజ్ జలసంధి అంశాలపై సాగిన అసలు చర్చలు
కెమెరాలో రికార్డైన ఈ కొన్ని క్షణాల వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు దీనిని ఇబ్బందికరమైన సంఘటనగా అభివర్ణించగా, మరికొందరు ఇందులో పెద్దగా ఏమీ లేదని కొట్టిపారేస్తున్నారు. "ఇందులో ఇబ్బంది పడటానికి ఏమీ లేదు. మాక్రాన్ ఏదో ఫన్నీగా చెప్పి ఉంటారు, దానికి ఆమె అలా స్పందించారు" అని ఒక యూజర్ కామెంట్ చేయగా, "ఆయన ఆమెను చూడగానే చాలా సంతోషంగా కనిపించారు, బహుశా ఏదైనా జోక్ వేసి ఉండొచ్చు" అని మరో యూజర్ అభిప్రాయపడ్డారు.
ఇక, ఈ ఇద్దరు నేతల మధ్య కీలక అంతర్జాతీయ అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా ఇరాన్ చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు, హర్మూజ్ జలసంధిలో పరిణామాలపై వారు ప్రధానంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే కాల్పుల విరమణ కాలంలో అన్ని వాణిజ్య నౌకల కోసం హర్మూజ్ జలసంధిని తిరిగి తెరుస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ ప్రకటించడం గమనార్హం.