'పాత మిత్రుల కలయిక': ఢిల్లీలో టీడీపీ మిత్రులను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

  • పార్లమెంట్ లాబీలో కేశవ్, నరేంద్రలతో ముచ్చటించిన సీఎం
  • 'ఎక్స్' వేదికగా పాతమిత్రులం కలుసుకున్నాంటూ కేశవ్ ట్వీట్
  • వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ టీడీపీ నాయకులు
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో తాను కలిసి పనిచేసిన పాత మిత్రులను కలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పొన్నూరు శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్రలను పార్లమెంట్ లాబీలో కలిసి కాసేపు ముచ్చటించారు.

ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ వేం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు. వీరు నలుగురు గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. రాష్ట్ర విభజన తదనంతర పరిణామాల నేపథ్యంలో, రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డిలతో సమావేశమైనట్లు పయ్యావుల కేశవ్ 'ఎక్స్' వేదికగా 'పాత మిత్రుల కలయిక' అంటూ పోస్టు పెట్టారు. రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిశామని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేసిన నరేందర్ రెడ్డికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

Revanth Reddy
Payyavula Keshav
Dhulipalla Narendra
Vem Narender Reddy
Telugu Desam Party

More Telugu News