డీలిమిటేషన్ బిల్లుపై పాకిస్థాన్ వ్యాఖ్యలు... స్పందించిన భారత్
- డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు పాక్ ప్రకటన
- భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని స్పష్టీకరణ
- పరిపాలనా, శాసనపరమైన ప్రక్రియలు భారత సార్వభౌమత్వానికి సంబంధించినదని వెల్లడి
ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకుంటే భారత్ అంగీకరించదని స్పష్టం చేశారు. దేశంలోని పరిపాలనా, శాసనపరమైన ప్రక్రియలకు సంబంధించిన నిర్ణయాలు సార్వభౌమత్వానికి సంబంధించినవని అన్నారు. వీటిలో ఇతర దేశాల జోక్యం అవసరం లేదని అన్నారు.