పూడి శ్రీహరికి షాక్.. వైసీపీ నేతలకు రిమాండ్ విధించిన హైకోర్టు

  • చంద్రబాబుపై అనుచిత పోస్టులు పెట్టిన పూడి శ్రీహరి, గిరీశ్ రెడ్డి
  • వారిని రిమాండ్ కు తరలించేందుకు అంగీకరించని కుప్పం కోర్టు
  • కుప్పం కోర్టు తీర్పును సస్పెండ్ చేసిన హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న యుద్ధం ఇప్పుడు న్యాయస్థానాల వరకు చేరింది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అభ్యంతరకర పోస్టులు పెట్టారనే ఆరోపణలతో అరెస్టయిన వైసీపీ సోషల్ మీడియా జనరల్ సెక్రటరీ పూడి శ్రీహరి, జి. గిరీశ్ కుమార్ రెడ్డిలకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. వీరికి రిమాండ్ విధించేందుకు నిన్న కుప్పం కోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. తాజాగా కుప్పం కోర్టు తీర్పును హైకోర్టు కొట్టివేసింది. వారిని రిమాండ్‌కు తరలించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నేడు న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.


గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో సోషల్ మీడియా అరాచకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులపై, మహిళా నేతలపై వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టడం దారుణ విషయమని అభిప్రాయపడింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వారి గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఈ తీర్పు ద్వారా మరోసారి స్పష్టం చేసింది.


Pudi Srihari
YS Jagan Mohan Reddy
Andhra Pradesh politics
Social media posts
AP High Court
Kuppam Court
Chandrababu Naidu
YSRCP
Gireesh Kumar Reddy
Social media arrests

More Telugu News