లెబనాన్‌తో ఒప్పందం... ఇజ్రాయెల్‌కు హెజ్బొల్లా తీవ్రవాద సంస్థ హెచ్చరిక

  • ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య 10 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం
  • ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తామన్న హెజ్బొల్లా
  • తమ వేళ్లు ట్రిగ్గర్ పైనే ఉన్నాయన్న హెజ్బొల్లా
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తే తిరిగి దాడులు చేస్తామని లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా తీవ్రవాద సంస్థ హెచ్చరించారు. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య పది రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హెజ్బొల్లా హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే, తమ వేళ్లు ఇంకా ట్రిగ్గర్ మీదే ఉన్నాయని తెలిపింది.

ఇరాన్, అమెరికా మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. తాజాగా, ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కూడా ఒప్పందం కుదిరింది. 10 రోజులపాటు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇప్పటికే ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని కూడా అమెరికా ప్రకటించింది. ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల నేతల మధ్య దశాబ్దాల తర్వాత తొలి సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.

హెజ్బొల్లా కూడా కాల్పుల విరమణ పాటిస్తూ, ఈ 10 రోజులు ప్రశాంతంగా ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పాడు. దీనివల్ల ఎలాంటి హింసాత్మక ఘటనలు ఉండవని, శాంతి ఏర్పడుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో లెబనాన్‌లోని ప్రజలు తమ సొంత ప్రాంతాలకు తిరిగి వెళుతున్నారు. యుద్ధం కారణంగా ఇంతకాలం సరిహద్దు ప్రాంతాల ప్రజలు తమ ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మరోవైపు, ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని చైనా స్వాగతించింది.

Hezbollah
Israel Lebanon conflict
Lebanon agreement
Israel Hezbollah
Ceasefire agreement

More Telugu News