ధాన్యం సేకరణ కోసం కేంద్రమంత్రిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy Meets Central Minister for Paddy Procurement
  • కేంద్రమంత్రి జోషితో రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ
  • 30 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్ ధాన్యం సేకరించాలని విజ్ఞప్తి
  • రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చ
కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారు. వానాకాలం యాసంగి పంటకు సంబంధించి 30 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్ ధాన్యం సేకరించాలని వారు కేంద్రమంత్రిని కోరారు.

2025-26 సీజన్ కు గాను యాసంగి పంట 90 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని కేంద్రమంత్రికి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. ధాన్యం సేకరణ, కేంద్ర ప్రభుత్వం వాటా సంబంధిత అంశాలపై కేంద్రమంత్రితో వారు చర్చించారు. కేంద్ర పౌరసరఫరాల శాఖ నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను మంజూరు చేయాలని వారు కోరారు.
Go Back to Shorts
Revanth Reddy
Telangana
Prahlad Joshi
Paddy procurement
Central Minister
Uttam Kumar Reddy

More Telugu News