హక్కుల రక్షణలో పుష్పరాజ్: ఢిల్లీ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్

Allu Arjun Seeks Rights Protection in Delhi High Court
  • తన అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలు, వాయిస్ వాడకూడదంటూ బన్నీ పిటిషన్
  • ఈరోజు విచారించనున్న జస్టిస్ తుషార్ రావు గెడెల ధర్మాసనం
  • ఇప్పటికే కోర్టు నుంచి రక్షణ పొందిన అమితాబ్, రజనీకాంత్ తదితరులు

సినిమా రంగంలో తనదైన బ్రాండ్ సృష్టించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఇప్పుడు తన వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోసం న్యాయక్షేత్రంలో అడుగుపెట్టారు. తన అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలు, చివరకు తన వాయిస్‌ను కూడా వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకోకుండా చూడాలని కోరుతూ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ముప్పు పొంచి ఉన్న ఈ కాలంలో సెలబ్రిటీల వాయిస్, ముఖచిత్రాలను మార్ఫింగ్ చేసి ప్రకటనలకు వాడుకుంటున్న తీరుపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. 


జస్టిస్ తుషార్ రావు గెడెల ధర్మాసనం ఇవాళ ఈ సివిల్ సూట్‌ను విచారించనుంది. గతంలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ వంటి దిగ్గజాలు పొందిన రక్షణనే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా కోరుతున్నారు. తన ప్రమేయం లేని వ్యాపారాల్లో తన పేరు వాడటం వల్ల బ్రాండ్ విలువ దెబ్బతింటుందన్నది ఆయన ప్రధాన వాదన.

Go Back to Shorts
Allu Arjun
Delhi High Court
Pushpa Raj
AI morphing
celebrity rights
brand value
Amitabh Bachchan
Rajinikanth
intellectual property
commercial use

More Telugu News