శ్రీకాళహస్తిలో ఈతకు వెళ్లి ఇద్దరి మృతి

  • ఈత కోసం బావిలోకి దిగి బాలుడు, యువకుడి మృతి
  • మృతులు త్రిశూల్ (12), తరుణ్ రెడ్డి (25)గా గుర్తింపు
  • బాలుడిని కాపాడే ప్రయత్నంలో మునిగిపోయిన యువకుడు
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈత సరదా ఇద్దరి ప్రాణాలను బలిగొంది. అరవకొత్తూరు గ్రామంలోని వ్యవసాయ బావిలో పడి ఓ బాలుడితో పాటు, ఓ యువకుడు కూడా మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మృతులను త్రిశూల్ (12), తరుణ్ రెడ్డి (25)గా గుర్తించారు.

వివరాల్లోకి వెళితే.. అరవకొత్తూరు గ్రామానికి చెందిన 5వ తరగతి విద్యార్థి త్రిశూల్, ఈత నేర్చుకోవాలనే ఆసక్తితో తన స్నేహితులతో కలిసి వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ఈత రాకపోయినా, సరదాగా బావిలోకి దూకేశాడు. నీటిలో మునిగిపోతుండటంతో భయంతో కేకలు వేశాడు.

అతడి అరుపులు విని సమీపంలో ఉన్న తరుణ్ రెడ్డి అనే యువకుడు వెంటనే స్పందించి, త్రిశూల్‌ను కాపాడేందుకు బావిలోకి దూకాడు. కానీ, దురదృష్టవశాత్తు లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Sri Kalahasti
Tirupati district
drowning
Aravakotturu village
swimming accident
Trishul
Tarun Reddy
Andhra Pradesh news
farm well

More Telugu News