బీబీసీలో ఉద్యోగాల కోత.. 2000 మందిపై వేటుకు రంగం సిద్ధం
- 15 ఏళ్లలో ఇదే అతిపెద్ద లేఆఫ్స్
- ఖర్చుల తగ్గింపు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం
- ఓటీటీల నుంచి పోటీ, తగ్గుతున్న ఆదాయం ప్రధాన కారణం
ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) భారీ ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. ఖర్చులను తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా దాదాపు 2,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. గత 15 ఏళ్లలో బీబీసీలో ఇదే అతిపెద్ద లేఆఫ్స్ కావడం గమనార్హం. సంస్థ మొత్తం 21,500 మంది సిబ్బందిలో దాదాపు 10 శాతం మందిపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది.
బుధవారం జరిగిన ఆల్-స్టాఫ్ మీటింగ్‌లో ఉద్యోగులకు ఈ విషయం తెలిపారు. వచ్చే నెలలో మాట్ బ్రిట్టిన్ కొత్త డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో ఈ భారీ తొలగింపులు చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 600 మిలియన్ పౌండ్ల (దాదాపు రూ.7,535 కోట్లు) ఆదా ప్రణాళికలో భాగంగా ఈ ఉద్యోగాల కోతను ప్రకటించారు. మారుతున్న మీడియా రంగానికి అనుగుణంగా సంస్థను పునర్వ్యవస్థీకరించడమే లక్ష్యమని బీబీసీ పేర్కొంది.
ప్రస్తుతం బీబీసీ తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. లైసెన్స్ ఫీజు ద్వారా ప్రధానంగా ఆదాయం పొందుతున్న బీబీసీకి.. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ వంటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. దీనికి తోడు, లైసెన్స్ ఫీజు చెల్లించే వారి సంఖ్య కూడా గత ఏడాదితో పోలిస్తే సుమారు 3 లక్షలు తగ్గింది. వీక్షకుల అభిరుచులు మారడం కూడా సంస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఈ స్థాయిలో ఉద్యోగాలను తొలగించడం వల్ల సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి పడుతుందని, ఇది సంస్థ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని కార్మిక సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ అంశాలపై బీబీసీ కవరేజీపై విమర్శలు రావడంతో గత డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ ఇటీవలే తన పదవి నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం తాత్కాలిక డైరెక్టర్ జనరల్ పర్యవేక్షణలో కార్యకలాపాలు సాగుతున్నాయి.