వరుణ్ తేజ్ మోకాలికి శస్త్రచికిత్స... పవన్ కల్యాణ్ స్పందన

Pawan Kalyan responds to Varun Tejs knee surgery
  • 'బరి' సినిమా ప్రాక్టీస్‌లో గాయపడిన హీరో వరుణ్ తేజ్
  • వరుణ్‌కు మోకాలికి శస్త్రచికిత్స 
  • త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన పవన్ కల్యాణ్
  • వైద్యుల సలహాలు పాటిస్తూ తిరిగి కెమెరా ముందుకు రావాలని సూచన
యువ హీరో వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. 'బరి' సినిమా కోసం ప్రాక్టీస్ చేస్తుండగా వరుణ్ తేజ్ తీవ్రంగా గాయపడగా ఆయన మోకాలికి శస్త్రచికిత్స జరగడం తెలిసిందే. దీనిపై పవన్ స్పందించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

"యువ కథానాయకుడు వరుణ్ తేజ్ 'బరి' చిత్రం కోసం ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడి మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారని తెలిసింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. వైద్యులు, ఫిజియోథెరపిస్టుల సలహాలు పాటిస్తూ సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ కెమెరా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని పవన్ కల్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రస్తుతం వరుణ్ తేజ్ వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
Go Back to Shorts
Varun Tej
Pawan Kalyan
Varun Tej injury
Bari movie
Varun Tej surgery
AP Deputy CM
Telugu cinema
knee surgery
Varun Tej health
Film shooting

More Telugu News