చెన్నై జట్టుకు మరో ఎదురుదెబ్బ.. టోర్నీ నుంచి ఖలీల్ అహ్మద్ ఔట్
- గాయం కారణంగా ఐపీఎల్ 2026 నుంచి తప్పుకున్న ఖలీల్ అహ్మద్
- కేకేఆర్‌తో మ్యాచ్‌లో తీవ్రంగా గాయపడిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్
- ఇప్పటికే ధోనీ, స్పెన్సర్ జాన్సన్ సేవలను కోల్పోయిన సీఎస్కే
- శనివారం హైదరాబాద్‌తో చెన్నై తదుపరి మ్యాచ్
ఐపీఎల్ 2026 సీజన్లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు (సీఎస్కే) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్, తొడ కండరాల గాయం కారణంగా టోర్నమెంట్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని సీఎస్కే ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది.
"కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కుడి తొడ కండరాల గాయానికి గురైన ఖలీల్ అహ్మద్, ఐపీఎల్ 2026 నుంచి వైదొలిగాడు. అతను త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం" అని సీఎస్కే తమ 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేసింది.
మంగళవారం చెపాక్ స్టేడియంలో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు ఖలీల్ ఇబ్బంది పడ్డాడు. పరుగు పూర్తి చేయకుండానే మధ్యలోనే ఆగిపోయి, కుడి కాలును పట్టుకుని నొప్పితో విలవిలలాడాడు. తొలుత కండరాలు పట్టేయడమే అనుకున్నా, గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మైదానం వీడాల్సి వచ్చింది. ఆ ఓవర్లోని మిగిలిన ఐదు బంతులను గుర్జప్నీత్ సింగ్ పూర్తి చేశాడు.
ఐపీఎల్ వర్గాల సమాచారం ప్రకారం ఖలీల్ తొడ కండరాల్లో చీలికలు ఏర్పడినట్లు తెలుస్తోంది. అవసరమైతే అతనికి శస్త్రచికిత్స కూడా చేయాల్సి రావొచ్చని, ఫాస్ట్ బౌలర్‌కు ఇలాంటి గాయాల నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటికే మహేంద్ర సింగ్ ధోనీ (పిక్క కండరాల గాయం), స్పెన్సర్ జాన్సన్ (వెన్నునొప్పి) సేవలను కోల్పోయిన సీఎస్కేకు ఖలీల్ దూరం కావడం పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ప్రస్తుతం ఖలీల్ స్థానాన్ని భర్తీ చేసేందుకు లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ముఖేశ్ చౌదరి, రైట్ ఆర్మ్ పేసర్ రామకృష్ణ ఘోష్ అందుబాటులో ఉన్నారు.
ఈ సీజన్లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లలో 2 విజయాలు సాధించిన రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై జట్టు, శనివారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.