మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన అసదుద్దీన్ ఒవైసీ

Asaduddin Owaisi Opposes Women Reservation Bill in Parliament
  • సాహిర్ లుధియాన్వి రాసిన కవితను సభలో వినిపించిన అసదుద్దీన్
  • బిల్లును సభలో ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్న అసదుద్దీన్
  • ఇది ముస్లిం ప్రాతినిథ్యాన్ని తుడిచివేసే చర్య అని ఆరోపణ
పార్లమెంటులో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును మజ్లిస్ పార్టీ వ్యతిరేకించింది. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. సభలో వివిధ పార్టీలు డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాయి. మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించారు.

ఈ బిల్లును నిరసిస్తూ ఆయన సాహిర్ లుధియాన్వి రాసిన ఒక కవితను లోక్ సభలో చదివి వినిపించారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ బిల్లును సభలో ప్రవేశపెట్టడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఈ చర్య మహిళా రిజర్వేషన్‌కు సంబంధించినది కాదని, ముస్లిం ప్రాతినిథ్యాన్ని తుడిచివేసే చర్య అని ఆరోపించారు. ఈ బిల్లు జనాభా ఎక్కువగా ఉన్నరాష్ట్రాలకు మరింత అధికారం ఇస్తుందని అన్నారు.

డీలిమిటేషన్ బిల్లుపై ఆయన మాట్లాడుతూ, బిల్లు ప్రజాస్వామ్య, సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. దక్షిణాది ప్రాంతాలకు సభలో ప్రాతినిథ్యం లేకుండా ఈ బిల్లు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్, ఎస్పీ, డీఎంకే సహా వివిధ పార్టీలు వ్యతిరేకించాయి.
Go Back to Shorts
Asaduddin Owaisi
Women Reservation Bill
Majlis Party
Parliament
Muslim Representation

More Telugu News