ఇదేం రాక్షస మనస్తత్వం?: జగన్పై మంత్రి లోకేశ్ ఫైర్
- వైసీపీ, జగన్పై మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు
- రాష్ట్రానికి కంపెనీలు వస్తుంటే తరిమేస్తామనడం రాక్షస మనస్తత్వం అంటూ చురక
- మత్స్యకారుల పిల్లలకు వెయ్యికి పైగా ఉద్యోగాలు వస్తుంటే అడ్డుకుంటారా అని ప్రశ్న
- తల్లిని, చెల్లిని గెంటేశారంటూ పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రానికి మంచి చేసే కంపెనీలు వస్తుంటే అడ్డుకోవడం దుర్మార్గమని, ఇది సైకోయిజం తప్ప మరొకటి కాదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు లోకేశ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు.
దేశ రక్షణకు ఉపయోగపడే అధునాతన బోట్లు తయారు చేసే కంపెనీ రాష్ట్రానికి వస్తుంటే స్వాగతించాల్సింది పోయి, తరిమేస్తామనడం ఎలాంటి మనస్తత్వమని లోకేశ్ ప్రశ్నించారు. ఈ కంపెనీ ద్వారా మత్స్యకారుల పిల్లలకు వెయ్యికి పైగా ఉద్యోగాలు వస్తాయంటే ఆనందించకుండా అడ్డుకుంటాననడం రాక్షస మనస్తత్వమే అవుతుందని అన్నారు.
ఇదే క్రమంలో ఆయన జగన్పై పరోక్షంగా వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. "తల్లిని తరిమేశారు, చెల్లిని గెంటేశారు. దైవం అంటే భక్తి లేదు. దేశం అంటే ద్వేషం. నిలువెల్లా స్వార్థం, మనసంతా విధ్వంసంతో రప్పా రప్పా నరుకుతాం, అమరావతిని మార్చేస్తాం, కట్టినవన్నీ కూల్చేస్తాం, కంపెనీలన్నీ వెళ్లగొడతాం.. ఏమిటీ దుర్మార్గ పనులు జగన్ మోహన్ రెడ్డి గారూ!" అని తన పోస్టులో లోకేశ్ నిలదీశారు. ప్రతిపక్షం తీరును ఆయన 'సైకోయిజం'గా అభివర్ణించారు.