కాల్పుల విరమణ పొడిగింపుపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు

Donald Trump comments on ceasefire extension with Iran
  • ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగించే ఆలోచన లేదన్న ట్రంప్
  • శాశ్వత ఒప్పందం వైపు తాము మొగ్గు చూపుతున్నామన్న ట్రంప్
  • ఒప్పందం కుదిరితేనే మంచిదని అభిప్రాయపడిన ట్రంప్
కాల్పుల విరమణ పొడిగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఇరాన్‌తో కొనసాగుతున్న కాల్పుల విరమణను పొడిగించే ఆలోచన తనకు లేదని అన్నారు. శాశ్వతమైన ఒప్పందం వైపు తాము మొగ్గు చూపుతున్నామని అన్నారు. టెహ్రాన్‌తో చర్చలు కొనసాగుతున్నప్పటికీ కాల్పుల విరమణను పునరుద్ధరించకుండానే అవి ముగిసే అవకాశముందని అన్నారు.

చర్చల ఫలితం ఎలా ఉంటుందనే విషయాన్ని పక్కన పెడితే, ఇరాన్‌తో ఒప్పందం కుదిరితేనే అందరికీ మంచిదని అభిప్రాయపడ్డారు. ఒప్పందం కుదిరితే ఇరాన్ కూడా తమ దేశాన్ని పునర్నిర్మించుకోవచ్చని అన్నారు. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ అంగీకారం గడువు ఈ నెల 21తో ముగియనుంది.

ఈ నేపథ్యంలో చర్చల ద్వారా శాశ్వత శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా ఎదురు చూస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్ అధికారులతో అమెరికా ప్రతినిధులు మరోసారి సమావేశం కానున్నారని ట్రంప్ వెల్లడించారు. రెండో విడత చర్చలపై ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Donald Trump
Iran
US Iran ceasefire
Iran nuclear deal
Ceasefire agreement
Permanent agreement

More Telugu News