జువ్వలదిన్నెకు చేరుకున్న జగన్

  • తాడేపల్లి నుంచి జువ్వలదిన్నెకు హెలికాప్టర్ లో చేరుకున్న జగన్
  • ఫిషింగ్ హార్బర్ ను పరిశీలించనున్న మాజీ సీఎం
  • మధ్యాహ్నం 12.25కి జువ్వలదిన్నె నుంచి బెంగళూరుకు పయనం

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ నేడు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెకు చేరుకున్నారు. తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరిన ఆయన హెలికాప్టర్ లో జువ్వలదిన్నెకు చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద వైసీపీ నేతలు, కార్యకర్తలు జగన్ కు ఘన స్వాగతం పలికారు. 


కాసేపట్లో ఆయన ఫిషింగ్ హార్బర్ కు చేరుకుంటారు. సుమారు అరగంట పాటు ఫిషింగ్ హార్బర్‌ను పరిశీలిస్తారు. అక్కడ ఉన్న వసతులు, అభివృద్ధి పనులపై సమీక్షిస్తారు. ఉదయం 11.05 గంటల నుంచి మధ్యాహ్నం 12.05 గంటల వరకు మత్స్యకారులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. వేట సమయంలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వ పరంగా అందాల్సిన సాయంపై వారితో చర్చిస్తారు. పర్యటన ముగించుకుని మధ్యాహ్నం 12.25 గంటలకు అక్కడి నుంచి బెంగళూరుకు బయలుదేరి వెళ్తారు.


Jagan
YS Jagan
Jagan Mohan Reddy
Juvaladinner
Nellore District
Andhra Pradesh
Fishing Harbor
Fishermen
YSRCP

More Telugu News