అదరగొట్టిన బ్యాటర్లు, బౌలర్లు.. కోల్‌కతాను చిత్తు చేసిన చెన్నై
- కేకేఆర్‌పై 32 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం
- మూడు కీలక వికెట్లతో కోల్‌కతా పతనాన్ని శాసించిన నూర్ అహ్మద్
- బ్యాటింగ్‌లో రాణించిన సంజూ శాంసన్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్
- లక్ష్య ఛేదనలో తడబడిన కోల్‌కతా.. విఫలమైన టాపార్డర్
- ఈ సీజన్‌లో చెన్నైకి ఇది వరుసగా రెండో గెలుపు
ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జోరు కొనసాగిస్తోంది. చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)పై 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌లో రాణించి 192 పరుగుల భారీ స్కోరు సాధించిన చెన్నై, ఆ తర్వాత బౌలింగ్‌లోనూ అదరగొట్టింది. ముఖ్యంగా స్పిన్నర్ నూర్ అహ్మద్ (3/21), పేసర్ అన్షుల్ కంబోజ్ (2/32) అద్భుత ప్రదర్శనతో కేకేఆర్‌ను 160/7 స్కోరుకే పరిమితం చేశారు. ఈ విజయంతో చెన్నై వరుసగా రెండో గెలుపును నమోదు చేయగా, కేకేఆర్ ఈ సీజన్‌లో ఇంకా బోణీ కొట్టలేదు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నైకి యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. కేవలం 17 బంతుల్లోనే 38 పరుగులు చేసి కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత సంజూ శాంసన్ (48), డెవాల్డ్ బ్రెవిస్ (41) కీలక ఇన్నింగ్స్‌లతో స్కోరు బోర్డును పరుగెత్తించారు. మధ్యలో కేకేఆర్ బౌలర్లు నరైన్, వరుణ్ చక్రవర్తి కట్టడి చేసే ప్రయత్నం చేసినా, చెన్నై బ్యాటర్లు దూకుడుగా ఆడి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు సాధించారు.
193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఛేదన ఏ దశలోనూ సాఫీగా సాగలేదు. సునీల్ నరైన్‌తో ఓపెనింగ్ ప్రయోగం చేసినా అది ఫలించలేదు. రెండో ఓవర్‌లోనే అన్షుల్ కంబోజ్.. ఫిన్ అలెన్‌ను ఔట్ చేసి చెన్నైకు తొలి బ్రేక్ ఇచ్చాడు. పవర్‌ప్లేలోనే నరైన్‌ను ఖలీల్ అహ్మద్ పెవిలియన్ పంపడంతో కేకేఆర్ 36/2తో కష్టాల్లో పడింది. అజింక్యా రహానే, అంగ్‌క్రిష్ రఘువంశీ కాసేపు ప్రతిఘటించినా, మిడిల్ ఓవర్లలో చెన్నై స్పిన్నర్లు విజృంభించారు.
ముఖ్యంగా ఆఫ్ఘన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ తన మాయాజాలంతో మ్యాచ్‌ను పూర్తిగా చెన్నై వైపు తిప్పేశాడు. కీలక సమయంలో రహానేను ఔట్ చేసిన నూర్, ఆ తర్వాత ఒకే ఓవర్‌లో కామెరాన్ గ్రీన్ (గోల్డెన్ డకౌట్), రింకూ సింగ్‌లను పెవిలియన్ చేర్చి కేకేఆర్ పతనాన్ని శాసించాడు. దీంతో 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కోల్‌కతా ఓటమి అంచున నిలిచింది. చివర్లో రమణ్‌దీప్ సింగ్ (23 బంతుల్లో 35), రోవ్‌మన్ పావెల్ (22 బంతుల్లో 31 నాటౌట్) పోరాడినా అప్పటికే ఆలస్యమైంది. కంబోజ్.. రమణ్‌దీప్‌ను ఔట్ చేసి కేకేఆర్ ఆశలకు గండికొట్టాడు. చివరకు కేకేఆర్ 160/7 స్కోరుకే పరిమితమైంది. దీంతో చెన్నై 32 రన్స్ తేడాతో కోల్‌కతాను చిత్తు చేసింది. కేకేఆర్ కు ఈ సీజన్‌లో ఇది నాలుగో ఓటమి.