అమెరికా బలగాలు మోహరించినప్పటికీ హర్మూజ్‌ను దాటిన రెండు చిన్న దేశాల నౌకలు
- ఇరాన్ పోర్టులు, తీర ప్రాంతాల చుట్టూ 15 నౌకలను మోహరించిన అమెరికా
- ఇరాన్‌కు వచ్చే, ఆ దేశాన్ని వీడే నౌకలను అడ్డుకోవడానికి మోహరింపు
- అమెరికా దిగ్బంధనాన్ని తప్పించుకుని హర్మూజ్‌ను దాటిన నౌకలు
- హర్మూజ్‌ను దాటిన చైనాకు చెందిన ట్యాంకర్ 'రిచ్ స్టార్రీ'
అమెరికా దిగ్బంధనాన్ని తప్పించుకుని చిన్న దేశాలకు చెందిన రెండు నౌకలు హర్మూజ్ జలసంధిని దాటాయి. ఇరాన్‌కు వచ్చే, ఆ దేశాన్ని వీడే నౌకలను అడ్డుకోవడానికి ఆ దేశ పోర్టులు, తీరప్రాంతాల చుట్టూ 15కు పైగా యుద్ధ నౌకలను అమెరికా రంగంలోకి దింపింది. అమెరికా పెద్ద ఎత్తున మోహరించినప్పటికీ, లైబీరియా జెండా కలిగిన 'క్రిస్టియానా' అనే బల్క్ క్యారియర్ ఇరాన్ ఓడరేవులో ఆదివారం మొక్కజొన్న సరుకును దించినట్లు కెప్లర్ నౌక రవాణా ట్రాకింగ్ డేటా వెల్లడించింది.
అమెరికా దిగ్బంధనం అమల్లోకి వచ్చిన రెండు గంటల తర్వాత ఈ నౌక హర్మూజ్ గుండా ప్రయాణించి లారాక్ ద్వీపాన్ని దాటింది. కొమొరోస్ జెండా కలిగిన రెండో నౌక ఎల్పిస్ కూడా లారాక్ ద్వీపం నుంచి బయలుదేరి హర్మూజ్‌ను దాటింది. ఈ రెండు మాత్రమే కాకుండా, చైనాకు చెందిన ట్యాంకర్ 'రిచ్ స్టార్రీ' కూడా హర్మూజ్ జలసంధిని దాటింది. ట్రంప్ హెచ్చరికలను చైనా పట్టించుకోలేదు.
పలు నౌకలు హర్మూజ్ జలసంధిని దాటడంపై ఇరాన్ స్పందించింది. ట్రంప్‌నకు భయపడే దేశాలకు మాత్రమే ఈ దిగ్బంధనం వర్తిస్తుందని తెలిపింది. అమెరికా నౌకాదళం తన పెద్ద అందమైన నౌకలతో హర్మూజ్ వద్ద మోహరించాలని చూసినప్పటికీ, బీజింగ్ మాత్రం వాటిని దాటుకుని వెళ్లిందని ఎద్దేవా చేసింది.