క్వాంటం రంగంలో ఏపీ పయనీర్... టెస్ట్‌బెడ్‌లను జాతికి అంకితం చేసిన సీఎం చంద్రబాబు
- అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీల ప్రారంభం
- క్వాంటం టెక్నాలజీకి అమరావతిని లాంచ్‌ప్యాడ్‌గా మారుస్తామన్న సీఎం చంద్రబాబు
- ఏఐ, క్వాంటం నైపుణ్యాల్లో 45 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని ప్రణాళిక
- డిసెంబరు నుంచి అమరావతి క్వాంటం వ్యాలీని ప్రారంభించనున్నట్టు వెల్లడి
- స్వదేశీ పరిజ్ఞానంతో క్వాంటం టెస్ట్‌బెడ్‌లను అభివృద్ధి చేసినట్టు తెలిపిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టెక్నాలజీ రంగంలో సరికొత్త చరిత్రను లిఖించింది. ప్రపంచ క్వాంటం దినోత్సవం, అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని దేశంలోనే తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీలను రాష్ట్రంలో ఆవిష్కరించారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ‘1ఎస్’, గన్నవరంలోని మేధా టవర్స్‌లో ‘1క్యూ’ పేరిట ఏర్పాటు చేసిన క్వాంటం హార్డ్‌వేర్ టెస్ట్‌బెడ్‌లను ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం జాతికి అంకితం చేశారు. ఈ చరిత్రాత్మక కార్యక్రమంతో ఆంధ్రప్రదేశ్, క్వాంటం కంప్యూటింగ్ ఉపకరణాలను పరీక్షించి, ధ్రువీకరించే సామర్థ్యం కలిగిన తొలి రాష్ట్రంగా అవతరించింది.
రాష్ట్ర భవిష్యత్తుకు సరికొత్త దిశ.. దేశంలో తొలి క్వాంటం ఫెసిలిటీలు ప్రారంభం
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, క్వాంటం సైన్స్ వందేళ్లు పూర్తి చేసుకున్న వేళ, ప్రపంచ క్వాంటం దినోత్సవాన ఈ ఫెసిలిటీలను ప్రారంభించుకోవడం ద్వారా చరిత్ర సృష్టించామని అన్నారు. "విజ్ఞానమే సామాజిక ప్రగతికి చిహ్నం అని చెప్పిన అంబేద్కర్ గారి జయంతి నాడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీ, మేధా టవర్స్‌లో 1క్యూ క్వాంటం సిస్టమ్‌ను ఏర్పాటు చేశాం. ఈ టెస్ట్‌బెడ్‌లను పరిశోధకులకు, కంపెనీలకు, విద్యార్థులకు అందుబాటులో ఉంచుతున్నాం" అని తెలిపారు.
భారత తొలి ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీలకు, అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు ప్రోత్సహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, కార్యదర్శి అభయ్ కరాందికర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
క్వాంటం టెక్నాలజీకి అమరావతి లాంచ్‌ప్యాడ్
"పారిశ్రామిక రంగానికి విద్యుత్ ఎంత కీలకమో, డిజిటల్ యుగానికి ఇంటర్నెట్ అంతే ముఖ్యం. ఆధునిక ఆవిష్కరణలకు క్వాంటం టెక్నాలజీ అంతకన్నా ప్రధానం" అని చంద్రబాబు నొక్కి చెప్పారు. భవిష్యత్తును శాసించే శక్తి క్వాంటం సాంకేతికతలోనే ఉందని, అందుకే అమరావతిని క్వాంటం టెక్నాలజీకి లాంచ్‌ప్యాడ్‌గా మారుస్తున్నామని స్పష్టం చేశారు.
ఐటీ రంగంలో తెలుగువారు పోషించిన కీలక పాత్రను గుర్తుచేస్తూ, ఇప్పుడు క్వాంటం టెక్నాలజీకి కూడా ఆంధ్రప్రదేశ్ వేదికగా మారడం గర్వకారణమని అన్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోని ‘అమరావతి 1ఎస్’ కంప్యూటర్ పరిశోధనలకు, మేధా టవర్స్‌లోని ‘అమరావతి 1క్యూ’ కంప్యూటర్ పారిశ్రామిక వినియోగానికి ఎంతగానో తోడ్పడతాయని వివరించారు.
క్వాంటం రంగంలో ‘ఆత్మనిర్భర్’ ఆంధ్రప్రదేశ్
కేవలం 8 నెలల్లోనే ఈ క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీలు వాస్తవ రూపం దాల్చాయని ముఖ్యమంత్రి తెలిపారు. "పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో క్వాంటం కంప్యూటర్లను నిర్మించాలని నేను సూచించాను. దాని ఫలితంగానే ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, పూణెలోని డీఆర్డీఓ వంటి సంస్థల భాగస్వామ్యంతో ఈ టెస్ట్‌బెడ్‌లు సిద్ధమయ్యాయి. వ్యూహాత్మక టెక్నాలజీల్లో ఇకపై భారత్ ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. దేశీయంగానే క్వాంటం ఉపకరణాలు తయారు చేయడం ‘ఆత్మనిర్భర్’ కార్యక్రమంలో కీలకమైన అంశం" అని చంద్రబాబు పేర్కొన్నారు. 2047 స్వర్ణాంధ్ర విజన్‌లో రూపొందించిన 10 సూత్రాల్లో డీప్ టెక్ ఒక కీలకమైన అంశమని ఆయన గుర్తుచేశారు.
డిసెంబరు నుంచి అమరావతి క్వాంటం వ్యాలీ
రాష్ట్రంలో చేపడుతున్న ఇతర అభివృద్ధి కార్యక్రమాలను కూడా చంద్రబాబు వివరించారు. "కృష్ణా నదీ తీరంలో అమరావతిని బ్లూ-గ్రీన్ సిటీగా, నెట్ జీరో కాన్సెప్టుతో నిర్మిస్తున్నాం. తిరుపతిలో స్పేస్ సిటీ, ఓర్వకల్లులో డ్రోన్ సిటీ, విశాఖలో మెడ్‌టెక్, అనంతపురంలో సెమీ కండక్టర్ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నాం. త్వరలోనే డేటా సెంటర్, ఏఐ మౌలిక సదుపాయాలను ప్రారంభిస్తాం. డిసెంబరు నుంచి అమరావతిలో క్వాంటం వ్యాలీ కూడా ప్రారంభమవుతుంది" అని ప్రకటించారు. 'వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్', 'ప్రతీ వెయ్యి మందికి ఒక స్టార్టప్' లక్ష్యాలతో ముందుకు వెళుతున్నామని తెలిపారు.
45 లక్షల మందికి నైపుణ్యాభివృద్ధి.. విస్తృత ఉపాధి అవకాశాలు
సాంకేతికతను కేవలం అనుసరించడమే కాకుండా, ఆవిష్కరణల స్థాయికి ఆంధ్రప్రదేశ్‌ను తీసుకెళ్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఐఐటీ చెన్నై, ఐబీఎం, వైసర్ సంస్థల భాగస్వామ్యంతో 45 లక్షల మంది యువతకు ఏఐ, క్వాంటం, డేటా సెక్యూరిటీ వంటి ఆధునిక నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తామని వెల్లడించారు. దీనివల్ల ఔషధాల ఆవిష్కరణ, వ్యవసాయ ఉత్పాదకత, రక్షణ పరిశోధన, లాజిస్టిక్స్, క్రయోజెనిక్స్ వంటి రంగాల్లో వినూత్న ఆవిష్కరణలు వస్తాయని, డిజిటల్ లావాదేవీలు మరింత సురక్షితంగా మారతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ కలిగిన రాష్ట్రంగా ఏపీ
మైనస్ 273 డిగ్రీల అత్యంత శీతల ఉష్ణోగ్రత వద్ద క్వాంటం హార్డ్‌వేర్, సెమీ కండక్టర్లను పరీక్షించేలా ఈ రిఫరెన్స్ ఫెసిలిటీలను ఏర్పాటు చేశారు. ఈ రెండు టెస్ట్‌బెడ్‌ల ద్వారా క్వాంటం కంప్యూటింగ్ ఉపకరణాలను పరీక్షించి, సర్టిఫై చేసేందుకు అవకాశం ఏర్పడింది. తద్వారా అమరావతి క్వాంటం వ్యాలీ, దేశంలోనే క్వాంటం హార్డ్‌వేర్‌ను ధృవీకరించే సామర్థ్యాన్ని అందిపుచ్చుకుంది.
ఈ కార్యక్రమంలో కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ కార్యదర్శి అభయ్ కరాందికర్, ప్రధాని సాంకేతిక సలహాదారు అజయ్ సూద్ (వర్చువల్ గా పాల్గొన్నారు), డీఆర్డీఓ డీజీ ఆర్వీ ప్రసాద్, క్యూబిట్ ఫోర్స్ ఫౌండర్ వెంకట సుబ్రమణియన్, ఎస్ఆర్ఎం వర్సిటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ్ తదితరులు పాల్గొన్నారు.