పరువు పోగొట్టుకున్న పాకిస్థాన్.. అమెరికా-ఇరాన్ చర్చలకు ఆతిథ్యమిచ్చిన హోటల్ బిల్లు చెల్లించని ప్రభుత్వం!
- ఏప్రిల్ 10 నుంచి 12 మధ్య చర్చలకు ఆతిథ్యమిచ్చిన పాక్
- ఇస్లామాబాద్‌లోని హోటల్ సెరెనాకు తరలి వచ్చిన అతిథులు
- ఆతిథ్యం ఇచ్చినప్పుడు రొటీన్ ఖర్చులు కూడా చెల్లించని పాకిస్థాన్
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి మధ్యవర్తి పాత్ర పోషించిన పాకిస్థాన్ ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఏప్రిల్ 10 నుంచి 12 వరకు ఇస్లామాబాద్‌లో జరిగిన అమెరికా-ఇరాన్ చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. కానీ మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్ ఈ చర్చల కోసం ఏర్పాటు చేసిన హోటల్ బిల్లు కూడా కట్టలేని పరిస్థితిని ఎదుర్కొంటోంది.
పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలకడం ద్వారా అంతర్జాతీయస్థాయిలో ఖ్యాతి దక్కించుకోవాలని పాకిస్థాన్ ప్రభుత్వం చూసింది. అందుకే అమెరికా, ఇరాన్ చర్చలకు ఆతిథ్యం ఇచ్చింది. ఇస్లామాబాద్‌లోని హోటల్ సెరెనాలో చర్చలకు ఏర్పాట్లు చేసింది. చర్చల్లో ఫలితం రాలేదు. కానీ హోటల్ బిల్లు మాత్రం మోగిపోయింది. ఈ చర్చల కోసం రెండు దేశాలకు చెందిన ప్రముఖులు చాలామంది వచ్చారు.
ఇప్పుడు ఆ హోటల్ బిల్లులను షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం చెల్లించలేదని వార్తలు వస్తున్నాయి. సమస్యను పరిష్కరించడానికి హోటల్ యజమాని రంగంలోకి దిగవలసి వచ్చింది. రెండు దేశాలకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు వచ్చే రొటీన్ ఖర్చులు కూడా చెల్లించడంలో పాకిస్థాన్ విఫలమైందని మీడియాలో కథనాలు వచ్చాయి.