పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆందోళన
- నాలుగు అంశాలతో శాంతి ప్రతిపాదన
- అబుదాబీ క్రౌన్ ప్రిన్స్‌తో సమావేశమై శాంతిప్రతిపాదన అందజేత
- ప్రతిపాదనలో శాంతియుత సహజీవనం, జాతీయ సార్వభౌమాధికారం తదితర అంశాలు
ఆయా దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్ నాలుగు అంశాలతో శాంతి ప్రతిపాదనను క్రౌన్ ప్రిన్స్ ముందుంచారని చైనా ప్రభుత్వరంగ మీడియా వెల్లడించింది. చైనా చేసిన ప్రతిపాదనలలో శాంతియుత సహజీవనం, జాతీయ సార్వభౌమాధికారం, చట్టబద్ధమైన అంతర్జాతీయ పాలన, అభివృద్ధి, ప్రపంచ భద్రత తదితర అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
చైనాకు చేరుకున్న రష్యా విదేశాంగ మంత్రి
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం చైనాకు చేరుకున్నారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఆయన కీలకమైన అంతర్జాతీయ అంశాలతో పాటు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నట్లు రష్యా విదేశాంగ శాఖ తెలిపింది.