"20 ఏళ్లు వర్సెస్ 5 ఏళ్లు.. అమెరికా ఇరాన్ ల అణు చర్చల్లో వీడని చిక్కుముడి"
పాకిస్థాన్ వేదికగా అమెరికా, ఇరాన్ ల మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. దాదాపు 21 గంటల పాటు జరిగిన ఈ సుదీర్ఘ చర్చలు అర్ధాంతరంగా ముగియడానికి ఓ కీలక అంశంపై ఇరు దేశాలు పట్టుబట్టడమే కారణమని సమాచారం. ఇరాన్ అణు కార్యకలాపాలపై ఆంక్షల విషయంలో ఇరుదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. ఇరాన్ యురేనియంను శుద్ధి చేసే కార్యక్రమాన్ని కనీసం 20 ఏళ్ల పాటు నిలిపివేయాలని అమెరికా పట్టుబట్టింది. అయితే, ఇరాన్ దీనికి ససేమిరా అంది. గరిష్ఠంగా ఐదేళ్ల కాలపరిమితికి మాత్రమే తాము ఒప్పుకోగలమని, ఆ తర్వాత తమ అణు అవసరాల దృష్ట్యా సమీక్షించుకుంటామని స్పష్టం చేసింది.
ఈ 15 ఏళ్ల వ్యత్యాసమే చర్చలు విఫలం కావడానికి ప్రధాన కారణమైందని అధికార వర్గాల సమాచారం. చర్చలు విఫలమైన వెంటనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ మొండి వైఖరి వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపిస్తూ హర్మూజ్ జలసంధిలో నౌకాదళ దిగ్బంధనానికి ఆదేశించారు. సుమారు 15 యుద్ధనౌకలతో ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టిన అమెరికా, ఇరాన్ నౌకాశ్రయాల నుంచి జరిగే రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది. ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న యురేనియం నిల్వలను కూడా దేశం దాటించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది.