దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్... ఈ నెల 14న చంద్రబాబు ప్రారంభిస్తున్నారు: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Announces Indias First Quantum Computer Launch in Amaravati
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టెక్నాలజీ రంగంలో ఒక చారిత్రక ఘట్టానికి సిద్ధమవుతోంది. భారతదేశంలోనే మొట్టమొదటి దేశీయ, ఓపెన్-యాక్సెస్ క్వాంటం కంప్యూటర్లను అమరావతిలో ఆవిష్కరించనున్నారు. ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 14న ముఖ్యమంత్రి చంద్రబాబు వీటిని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.

ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ద్వారా కీలక వివరాలు పంచుకున్నారు. ఎస్ఆర్‌ఎం యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 'అమరావతి 1S', 'అమరావతి 1Q' పేరుతో ఈ క్వాంటం కంప్యూటర్లను జాతికి అంకితం చేయనున్నట్లు తెలిపారు. దీని ద్వారా అమరావతిని 'క్వాంటం వ్యాలీ'గా, ఒక గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని లోకేశ్ పేర్కొన్నారు.

"భారత్‌లో తయారై, భారతీయులకు అందుబాటులో ఉంటూ, ప్రపంచానికి సేవలు అందించడమే" తమ ధ్యేయమని ఆయన వివరించారు. ఈ పరిణామంతో దేశ క్వాంటం భవిష్యత్తుకు ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వహిస్తుందని, భవిష్యత్ టెక్నాలజీ అమరావతి నుంచే మొదలవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ఆవిష్కరణతో క్వాంటం కంప్యూటింగ్ రంగంలో ఏపీ కీలక పాత్ర పోషించనుంది.
Go Back to Shorts
Nara Lokesh
Quantum Computer
Andhra Pradesh
Amaravati
Chandrababu Naidu
SRM University
Quantum Valley
India Quantum Computing

More Telugu News