హైదరాబాద్‌లో కపిల్ దేవ్‌తో గంటా శ్రీనివాసరావు భేటీ.. ఆసక్తికర విషయాలు వెల్లడి
భారత జట్టుకు తొలిసారి ప్రపంచకప్ అందించిన క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్‌తో టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సమావేశంలో గంటా శ్రీనివాసరావు.. కపిల్ దేవ్‌ను విశాఖపట్నం రావాల్సిందిగా ఆహ్వానించగా, ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలోనే తాను విశాఖ వస్తానని కపిల్ హామీ ఇచ్చినట్టు గంటా వెల్లడించారు.
హైదరాబాద్‌లో జరిగిన ఈ విందు సమావేశంలో ప్రముఖ దర్శకుడు శివ కొరటాల, ఇతర మిత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాదాపు 43 ఏళ్ల నాటి క్రికెట్‌తో పాటు, ప్రస్తుత తరం ఆట గురించి సుదీర్ఘంగా చర్చించుకున్నామని గంటా తెలిపారు. కపిల్ దేవ్ తన క్రికెట్ జీవితంలోని మధుర స్మృతులను పంచుకున్నారని పేర్కొన్నారు.
ఈ భేటీలో రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి గురించి కపిల్ దేవ్‌కు వివరించినట్టు గంటా శ్రీనివాసరావు తన ప్రకటనలో తెలిపారు.
విశాఖ నగరం తనకు కూడా ఎంతో ఇష్టమని కపిల్ దేవ్ చెప్పారని గంటా వివరించారు. బీచ్ సిటీ పర్యటన కోసం ఎదురుచూస్తున్నానని, త్వరలోనే అక్కడి గోల్ఫ్ కోర్స్‌ను సందర్శిస్తానని కపిల్ హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.