ఆశా భోంస్లే అస్తమయం... సీఎం చంద్రబాబు స్పందన
ప్రముఖ గాయని, సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆశా భోంస్లే కన్నుమూశారు. ఆమె మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆశా భోంస్లే మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందించారు.
"ప్రముఖ గాయని ఆశా భోంస్లే జీ ఇక లేరన్న వార్త విని నేను తీవ్ర దిగ్భ్రాంతికి, బాధకు గురయ్యాను. భారత సంగీత ప్రపంచంలో ఆమె ఒక దిగ్గజం. ఆమె లాంటి విలక్షణమైన, వైవిధ్యమైన గాయని మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలోనే అత్యధిక పాటలు పాడిన కళాకారిణిగా చరిత్రలో నిలిచిపోయిన ఆమె కీర్తి అజరామరం.
ఏడు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సంగీత ప్రస్థానం అసాధారణమైనది. ఆమె పాడిన పాటలు ఎన్నో తరాలను ఉర్రూతలూగించాయి, మనందరి జీవితాల్లో భాగమైపోయాయి. ఆమె గాత్రంలోని మాధుర్యం, భావం మరపురానివి. పద్మవిభూషణ్ వంటి అత్యున్నత పురస్కారం ఆమె ప్రతిభకు ఒక చిన్న గుర్తింపు మాత్రమే.
భారతదేశ సంగీత వారసత్వంలో ఆమె స్థానం ఎప్పటికీ పదిలంగా ఉంటుంది. ఆమె పాటల రూపంలో మన మధ్యే చిరస్థాయిగా జీవించి ఉంటారు. ఈ విషాద సమయంలో, ఆమె కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులకు నా తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.