వికారాబాద్ జిల్లా నాసాన్‌పల్లి చెరువులో ఇద్దరు వ్యక్తుల మృతి
వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన కోట్‌పల్లి మండలం పరిధిలోని నాసాన్‌పల్లి చెరువులో జరిగింది. మృతులను అదే మండలం బర్వాద్ గ్రామానికి చెందిన చాకలి మల్లయ్య, దోమ పాండుగా గుర్తించారు.
వివరాల్లోకి వెళితే... మల్లయ్య, పాండు ఇద్దరూ 10వ తేదీన నాసాన్‌పల్లి చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. అయితే, తిరిగి రాకపోవడంతో ఆందోళన మొదలైంది. ఇంతలో చెరువులో రెండు మృతదేహాలు కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. వారి మృతిపై గ్రామస్థులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కొందరు రైతులు పంట పొలాలకు నీటిని తరలించేందుకు చెరువులో విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేశారని, వాటి నుంచి విద్యుత్ ప్రవహించి షాక్‌కు గురై ఇద్దరూ మరణించి ఉండొచ్చని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను వెలికితీసి, పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. మరణానికి కచ్చితమైన కారణాలు పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాక తెలుస్తాయని అధికారులు చెప్పారు.