అమరావతిపై జగన్ హెచ్చరికలు.. 'మావిగన్' వెనుక ఉద్దేశం అదే: ఏబీవీ

మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 'మావిగన్' అంటూ చేసిన వ్యాఖ్యల వెనుక ఓ హెచ్చరిక ఉందని, తాను మళ్లీ అధికారంలోకి వస్తే అమరావతిని నాశనం చేస్తానని ఇన్వెస్టర్లను భయపెట్టేందుకే అలా మాట్లాడుతున్నారని విశ్రాంత ఐపీఎస్ అధికారి, సెంటర్ ఫర్ లిబర్టీ కన్వీనర్ ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు. మొదటి నుంచీ జగన్ అమరావతికి వ్యతిరేకమని, రాజధానికి ఎన్ని అడ్డంకులు సృష్టించాలో అన్నీ సృష్టించారని ఆయన విమర్శించారు.

విజయవాడ గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. "అమరావతికి చట్టబద్ధత కల్పించడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే 'మావిగన్' వంటి వింత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే పత్రికలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు" అని ఏబీవీ దుయ్యబట్టారు. జగన్ వ్యాఖ్యలకు వైసీపీ నేతలు మద్దతు పలకడం దురదృష్టకరమని ఆయన అన్నారు.

అమరావతి నిర్మాణానికి రూ.2 లక్షల కోట్లు ఖర్చవుతుందని జగన్ చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఏబీవీ తెలిపారు. ఆ మొత్తం ఎలా ఖర్చవుతుందో వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ తన తీరు మార్చుకోకపోతే, భవిష్యత్తులో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

AB Venkateswara Rao
YS Jagan
Amaravati
AP capital
Andhra Pradesh
MAVIGAN
YSRCP
Andhra politics

More Telugu News