ఏపీలో భగ్గుమంటున్న ఎండలు: 45 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. శనివారం కడప జిల్లాలో గరిష్టంగా 44.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. ఈ నేపథ్యంలో, ఆదివారం కూడా పలు జిల్లాల్లో తీవ్రమైన ఎండలతో పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) హెచ్చరికలు జారీ చేసింది.
శనివారం రాష్ట్రవ్యాప్తంగా 200కు పైగా మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడప జిల్లా కొండాపురం మండలం పొట్టిపాడులో అత్యధికంగా 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 44.3 డిగ్రీలుగా రికార్డయింది. రాయలసీమ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది.
ఆదివారం పరిస్థితి మరింత తీవ్రంగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాలులు వీస్తాయని, మొత్తం 93 మండలాల్లో వీటి ప్రభావం ఉంటుందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది.
శుక్రవారం కూడా కాకినాడ జిల్లా కరపలో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వారాంతంలో ఎండల తీవ్రత గరిష్ట స్థాయికి చేరుకుంటుందని అధికారులు ముందే హెచ్చరించారు. ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్న సమయంలో బయటకు రావొద్దని సూచించారు.