చెపాక్‌లో సంజూ మెరుపులు.. పసుపు జెర్సీలో తొలి అర్ధశతకం!

టీ20 ప్రపంచకప్ హీరో సంజూ శాంసన్ ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) తరఫున ఆడుతున్న అతను, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న‌ మ్యాచ్‌లో మెరుపు అర్ధశతకం సాధించాడు. చెపాక్ స్టేడియం వేదికగా చెలరేగిన సంజూ, ఈ సీజన్‌లో తన తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.

ఈ సీజన్‌లో ఆడిన తొలి మూడు మ్యాచ్ లలో విఫలమై నిరాశపరిచిన సంజూ, ఈ మ్యాచ్‌లో మాత్రం ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగి బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కేవలం 26 బంతుల్లోనే 9 ఫోర్ల సాయంతో 50 పరుగుల మార్కును అందుకున్నాడు. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో సింగిల్ తీసి సీఎస్కే త‌ర‌ఫున‌ తన తొలి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

పసుపు జెర్సీలో ఇదే తొలి అర్ధశతకం కావడంతో సంజూ ఎంతో ఆనందంగా కనిపించాడు. తన కలల జట్టు అయిన చెన్నై తరఫున రాణించాలన్న పట్టుదలతో బరిలోకి దిగిన అతను, ఎట్టకేలకు తన బ్యాట్ పవర్ చూపించాడు. ప్రస్తుతం సంజూ 43 బంతుల్లో 90 పరుగులతో సెంచ‌రీ దిశ‌గా కొనసాగుతున్నాడు. చెన్నై జట్టు 15 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 160 పరుగులు చేసింది.

Sanju Samson
Sanju Samson IPL
Chennai Super Kings
CSK vs DC
IPL 2024
Chepauk Stadium
Delhi Capitals
T20 World Cup
Indian Premier League

More Telugu News