ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెడ్గేవార్‌కు నివాళి అర్పించిన రణవీర్ సింగ్... మోహన్ భగవత్‌తో భేటీ

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్‌తో భేటీ అయ్యారు. నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం ముంబై నుంచి ప్రత్యేక విమానంలో నాగ్‌పూర్‌కు చేరుకున్న రణ్‌వీర్, నేరుగా రేషిమ్‌బాగ్‌లోని హెడ్గేవార్ స్మృతి మందిరానికి వెళ్లారు. అక్కడ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్‌కు నివాళులర్పించారు.

అనంతరం మోహన్ భగవత్‌తో రణ్‌వీర్ సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య సంభాషణ ఫలప్రదంగా సాగినట్లు తెలుస్తోంది. ఈ పర్యటనకు రణ్‌వీర్ సంప్రదాయబద్ధంగా తెల్లటి కుర్తా పైజామాలో హాజరయ్యారు. రణ్‌వీర్ పర్యటనను, భేటీని ఆర్ఎస్ఎస్ వర్గాలు సైతం ధృవీకరించాయి. సాయంత్రం 4 గంటలకు నాగ్‌పూర్‌కు వచ్చిన ఆయన, రాత్రి 8 గంటల సమయంలో తిరిగి ముంబైకి పయనమయ్యారు.

గతంలో విజయదశమి సందర్భంగా ఆరెస్సెస్ శతాబ్ది ఉత్సవాల వేళ రణ్‌వీర్ ఆ సంస్థకు శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. గత 100 ఏళ్లుగా సంస్థ చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ, భవిష్యత్తులోనూ స్ఫూర్తినివ్వాలని ఆయన ఆకాంక్షించారు.

ఇక సినిమాల విషయానికొస్తే, రణ్‌వీర్ సింగ్ ప్రస్తుతం 'ధురంధర్: ది రివెంజ్' చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 19న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. 2025లో వచ్చిన 'ధురంధర్' చిత్రానికి ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. ఈ రెండు చిత్రాలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Ranveer Singh
Mohan Bhagwat
RSS
Hedgewar
Rashtriya Swayamsevak Sangh
Nagpur
Bollywood
Dhurandhar The Revenge
Keshav Baliram Hedgewar
RSS Centenary Celebrations

More Telugu News