నా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే అసత్య ప్రచారం చేస్తున్నారు: మంగ్లీ

Mangli Says False Propaganda Damaging Her Reputation

సినీ గాయని మంగ్లీ చుట్టూ ముసురుకున్న ఆర్థిక వివాదం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. మైక్రో ఫైనాన్స్ పేరుతో పది కోట్ల రూపాయల మేర మోసం చేశారంటూ న్యాయవాది సుబ్బారావు చేసిన ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. కేవలం తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఉద్దేశపూర్వకంగా ఈ అసత్య ప్రచారానికి తెరలేపారని మంగ్లీ మండిపడ్డారు. లాయర్ సుబ్బారావు తనపై ఫిర్యాదు చేయడానికి ముందే, తానే నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఫిర్యాదు చేశానని ఆమె వెల్లడించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నోట్ల కట్టల దృశ్యాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ డబ్బు తనది కాదని ఆమె స్పష్టం చేశారు.


ఒక మహిళగా, కళాకారిణిగా సమాజంలో తనకున్న గుర్తింపును హననం చేసేలా జరుగుతున్న ఈ కుట్రపై చట్టపరంగా పోరాడతానని మంగ్లీ హెచ్చరించారు. తన వ్యక్తిగత మనోభావాలను దెబ్బతీస్తూ చేస్తున్న ఈ తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని ఆమె కోరారు. కాగా, పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో మంగ్లీ, ఆమె సోదరుడితో పాటు మరికొందరిపై న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వారి నుంచి ప్రాణహాని ఉందని ఆయన పేర్కొనడంతో పోలీసులు ఇప్పటికే బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొడుతూ మంగ్లీ ఎదురుదాడికి దిగడంతో ఈ వివాదం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Go Back to Shorts
Mangli
Mangli singer
Mangli controversy
Subbarao lawyer
Narsingi police station
Panjagutta police station
Defamation campaign
Financial dispute
Fake news Mangli
Telugu singer Mangli

More Telugu News