'డెకాయిట్' తొలి రోజు కలెక్షన్ల రికార్డ్... అడివి శేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్
యంగ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'డెకాయిట్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనమైన ఆరంభాన్ని అందుకుంది. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, తొలిరోజు రూ.15 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది. ఈ వసూళ్లతో 'డెకాయిట్' అడివి శేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచి రికార్డు సృష్టించింది.ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ చిత్రం మొదటి రోజే 5.75 లక్షల డాలర్లకు పైగా వసూలు చేసి సత్తా చాటింది.
షనీల్ డియో దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌ను తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు. ప్రేక్షకుల నుంచి మంచి స్పందనతో ఈ చిత్రం సాలిడ్ ఓపెనింగ్స్‌ను నమోదు చేసింది. వారాంతంలో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.