మంత్రి టీజీ భరత్ జిమ్ వీడియోపై నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Nara Lokesh Comments on Minister TG Bharat Gym Video
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌పై ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆసక్తికరమైన రీతిలో ప్రశంసలు కురిపించారు. జిమ్‌లో టీజీ భరత్ కఠినమైన వ్యాయామాలు చేస్తున్న వీడియోను షేర్ చేసిన లోకేశ్, ఆయన కసరత్తులను రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణంతో ముడిపెడుతూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి.

టీజీ భరత్ జిమ్‌లో జంపింగ్స్ తో కూడిన వర్కౌట్ చేస్తున్న వీడియోను నారా లోకేశ్ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఈ వీడియోకు ఆయన ఓ ఆసక్తికరమైన వ్యాఖ్యను జోడించారు. "రాష్ట్రంలో అత్యుత్తమ పెట్టుబడి వాతావరణాన్ని అందించడానికి మా పరిశ్రమల మంత్రి టీజీ భరత్ గారు ఇలా అడ్డంకులను దాటుతున్నారు" అంటూ లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలతో పాటు 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్', 'చూజ్ స్పీడ్ చూజ్ ఏపీ' అనే హ్యాష్‌ట్యాగ్‌లను కూడా జతచేశారు. 
Go Back to Shorts
TG Bharat
Nara Lokesh
Andhra Pradesh
Industries Minister
Investments
AP Investments
Jumping Exercise
Gym Workout
Speed of Doing Business
Choose Speed Choose AP

More Telugu News