'జన నాయగన్' సీన్స్ లీక్ పై చిరంజీవి స్పందన

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయగన్' సినిమాకు లీకుల బెడద ఎదురైంది. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు సోషల్ మీడియాలో లీక్ కావడంపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు.

"నమ్మకం, ఎంతో మంది సమష్టి కృషి, కలల మీద సినిమా నిర్మాణం ఆధారపడి ఉంటుంది. 'జన నాయగన్' లీక్ కావడం నన్ను ఎంతగానో ఆందోళనకు గురిచేసింది. ఇలాంటి ఘటనలు చిత్ర పరిశ్రమలోని మనందరినీ ప్రభావితం చేస్తాయి. మన సృజనాత్మకతను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తాయి" అని చిరంజీవి తన పోస్టులో పేర్కొన్నారు.

ఈ నష్టాన్ని అరికట్టడంలో, దోషులను శిక్షించడంలో చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు తాము అండగా ఉంటామని చిరంజీవి స్పష్టం చేశారు. సినిమాను గౌరవించుకోవడానికి, పరిరక్షించుకోవడానికి మనమందరం మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. "పైరసీని చంపేద్దాం.. సినిమాను బతికిద్దాం" అంటూ తన పోస్టును ముగించారు.

Chiranjeevi
Vijay
Jana Nayagan
KVN Productions
Kollywood
Tollywood
Movie Leaks
Piracy
Film Industry
Cinema

More Telugu News