పంత్ భాయ్ చెప్పాడు.. నేను కొట్టాను: లక్నో హీరో ముకుల్ చౌదరి

భారత క్రికెట్‌లో ప్రతిభకు కొదవ లేదు. కానీ సరైన అవకాశం, మార్గదర్శకత్వం లభించినప్పుడే యువ ఆటగాళ్లు సంచలనాలు సృష్టిస్తారు. లక్నో సూపర్‌జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) యువ బ్యాటర్ ముకుల్ చౌదరి విషయంలో ఇదే జరిగింది. గురువారం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌)తో జరిగిన మ్యాచ్‌లో 22 ఏళ్ల ముకుల్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో తన జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు.

182 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన ముకుల్, కేకేఆర్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అవేశ్ ఖాన్‌తో కలిసి 54 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇందులో విశేషమేమిటంటే, అవేశ్ ఖాన్ కేవలం ఒక పరుగు మాత్రమే చేయగా, మిగిలిన 52 పరుగులు ముకుల్ బాదడం విశేషం. చివరి బంతికి బౌండరీ కొట్టి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

మ్యాచ్ అనంతరం ముకుల్ మాట్లాడుతూ తన ప్రదర్శన వెనుక కెప్టెన్ రిషబ్ పంత్ ఇచ్చిన సలహా ఉందని వెల్లడించాడు. "గతంలో మ్యాచ్‌లను ముగించడానికి చాలా తొందరపడేవాడిని. కానీ ఇప్పుడు ప్రశాంతంగా ఉండటంపై దృష్టి పెట్టాను. ఆటను చివరి వరకు తీసుకెళ్తే గెలిపించగలనని నమ్ముతున్నా" అని తెలిపాడు.

"గత మ్యాచ్‌లో సరిగా టైమింగ్ చేయలేకపోయాను. దాంతో రిషబ్ భాయ్‌తో మాట్లాడాను. 'నువ్వు అతిగా ఆలోచిస్తున్నావు. నీ పనిపై దృష్టి పెట్టు. బంతిని చూసి ఆడు. నీపై నాకు నమ్మకం ఉంది. నీపై నీకు కూడా నమ్మకం ఉండాలి' అని చెప్పాడు. ఆ మాటలు నాలో ఆత్మవిశ్వాసం నింపాయి" అని ముకుల్ వివరించాడు. పంత్ ఇచ్చిన భరోసాతోనే ఎలాంటి ఒత్తిడి లేకుండా తన సహజమైన ఆట ఆడి జట్టును గెలిపించగలిగానని ముకుల్ పేర్కొన్నాడు.

Mukul Choudhary
Lucknow Super Giants
LSG
Rishabh Pant
KKR
Kolkata Knight Riders
IPL 2024
Avesh Khan
Cricket
Eden Gardens

More Telugu News