ప్రభాస్ ‘స్పిరిట్’ సెట్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం
రెబెల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘స్పిరిట్’ షూటింగ్ సెట్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. చిత్రీకరణ జరుగుతుండగా సెట్‌లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగినప్పుడు ప్రభాస్ సెట్‌లో లేకపోవడంతో చిత్ర బృందంతో పాటు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ప్రమాదంలో యూనిట్ సభ్యులలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. అగ్నిప్రమాదం వల్ల సెట్‌లో వేసిన కొన్ని టెంట్లు, షూటింగ్‌కు సంబంధించిన పరికరాలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలిసింది. అయితే, పెద్ద ప్రమాదం తప్పిపోవడంతో అందరూ ఊరట చెందారు.
ప్రమాద సమయంలో ప్రభాస్ సెట్‌లో లేరు. గత కొన్ని రోజులుగా ఆయన లేకుండానే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్న 'ఫౌజీ' సినిమా షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ప్రభాస్, దర్శకుడు సందీప్‌తో కలిసి హైదరాబాద్‌లో ఓ సినిమా చూస్తూ కనిపించారు.
ప్రభాస్ నటించిన 'ఫౌజీ' ఈ ఏడాది దసరాకు విడుదలయ్యే అవకాశం ఉండగా, 'స్పిరిట్' సినిమా కోసం త్వరలోనే ఆయన డేట్లు కేటాయించనున్నారు. పోలీస్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2027 మార్చిలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చిన్న ప్రమాదం కారణంగా ఆగిన షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుందని చిత్ర వర్గాలు తెలిపాయి.