అసలు మద్యం ముట్టని నేను.. రోజూ ఫుల్ బాటిల్ తాగేలా చేసింది ఆ సంఘటనే: ఆమిర్ ఖాన్
బాలీవుడ్ అగ్ర నటులలో ఒకరైన ఆమిర్ ఖాన్ తన జీవితంలోని అత్యంత క్లిష్టమైన, చీకటి రోజులకు సంబంధించిన కొన్ని సంచలన విషయాలను బయటపెట్టారు. తన మొదటి భార్య రీనా దత్తాతో విడాకుల తర్వాత తాను తీవ్రమైన మనోవేదనకు గురయ్యానని, ఆ బాధలో మద్యానికి బానిసయ్యానని అంగీకరించారు. ఏడాదిన్నర పాటు ప్రతీరోజూ రాత్రి దాదాపు ఒక ఫుల్ బాటిల్ మద్యం సేవించేవాడినని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ విషయాలు ఆయన ఇటీవల 'డ్యూలాగ్ విత్ బరున్ దాస్' అనే టాక్ షోలో పంచుకున్నారు.
ఈ షోలో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ... "నా మొదటి భార్య రీనాతో విడిపోయే వరకు నేను మద్యం ముట్టలేదు. కానీ, ఆమె పిల్లలతో కలిసి నన్ను వదిలి వెళ్లిపోయిన రోజు నేను ఒంటరివాడినయ్యాను. ఆ సమయంలో నా భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయాను. ఇంట్లో అతిథుల కోసం ఉంచిన మద్యాన్ని ఆ రాత్రి తాగడం మొదలుపెట్టాను. ఆ తర్వాత దాదాపు ఏడాదిన్నర పాటు ప్రతీ రాత్రి ఒక బాటిల్ మద్యం తాగేవాడిని. షూటింగ్ సన్నివేశాల కోసం ఒకటి రెండుసార్లు తాగడం తప్ప, అంతకుముందు నాకు ఆ అలవాటు లేదు" అని తన జీవితంలోని బాధాకరమైన దశను గుర్తుచేసుకున్నారు.
ఆమిర్ ఖాన్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే, ఆయనకు రెండుసార్లు వివాహమైంది. 1986లో రీనా దత్తాను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు జునైద్ ఖాన్, ఇరా ఖాన్. అయితే, 2002లో వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 'లగాన్' సినిమా సెట్స్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన కిరణ్ రావును 2005లో వివాహం చేసుకున్నారు. వీరికి ఆజాద్ రావు ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. 15 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత 2021లో కిరణ్ రావుతో కూడా విడిపోయారు. ఇటీవలే తన 60వ పుట్టినరోజున ఆమిర్ తన కొత్త గర్ల్‌ఫ్రెండ్ గౌరీ స్ప్రాట్‌ను మీడియాకు పరిచయం చేశారు.
ఇక, ఆమిర్ ఖాన్ కెరీర్ విషయానికొస్తే, ఆయన చివరిసారిగా 2025 క్రిస్మస్కు విడుదలైన 'సితారే జమీన్ పర్' చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం సన్నీ డియోల్‌తో కలిసి 'లాహోర్ 1947' చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు, ఆయన నిర్మాతగా వ్యవహరించిన 'ఏక్ దిన్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో ఆమిర్ కుమారుడు జునైద్ ఖాన్, సాయి పల్లవి జంటగా నటించారు. ఈ రొమాంటిక్ డ్రామా మే 1న థియేటర్లలో విడుదల కానుంది.