నా 30వ పుట్టినరోజు ఇలా జరిగింది: రష్మిక

స్టార్ హీరోయిన్, 'నేషనల్ క్రష్' రష్మిక మందన్న తన 30వ పుట్టినరోజును ఎంతో ప్రత్యేకంగా జరుపుకున్నారు. పెళ్లి తర్వాత వచ్చిన తొలి పుట్టినరోజు కావడంతో, ఈ వేడుకను తన భర్త, నటుడు విజయ్ దేవరకొండతో కలిసి సొంతూరు కూర్గ్‌లో జరుపుకోవడం విశేషం. ఏప్రిల్ 5న జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఈ సందర్భంగా రష్మిక తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తాను చిన్నప్పటి నుంచి వెళ్తున్న గుడిని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. సమయాభావం వల్ల తాను చదువుకున్న పాఠశాలను బయటి నుంచే చూసి మురిసిపోయారు. అనంతరం, ఉదయ్‌పూర్‌లో జరిగిన తమ వివాహ వేడుకకు హాజరు కాలేకపోయిన కుటుంబ సభ్యులు, బంధువులను ఈ సందర్భంగా కలుసుకున్నారు. వారితో కలిసి డిన్నర్ ఏర్పాటు చేసి ఆనందంగా గడిపారు. తన పాఠశాల స్నేహితులను కూడా కలుసుకొని పాత రోజులను గుర్తు చేసుకున్నారు.

ఈ వేడుకపై రష్మిక సోషల్ మీడియాలో స్పందిస్తూ, "ఈసారి నా 30వ పుట్టినరోజు కాస్త భిన్నంగా గడిచింది. చాలాకాలం తర్వాత ఇంటికి వెళ్లాను. జీవితంలో జరిగే ప్రతీది ఒక మంచి కారణం కోసమేనని అనిపిస్తోంది. ఇప్పుడు అన్నీ సార్థకమైనట్లుగా ఉంది" అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
చాలాకాలం ప్రేమలో ఉన్న రష్మిక, విజయ్ దేవరకొండ ఈ ఏడాది ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

Rashmika Mandanna
Rashmika birthday
Vijay Deverakonda
Rashmika Vijay wedding
Coorg
National Crush
Indian actress
Udaipur wedding
Rashmika 30th birthday

More Telugu News